. . . 2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
హైదరాబాద్, బతుకమ్మ :
పోలీసు శాఖలో అవినీతి ఊడలు అన్నీ విభాగాల్లో నాటుకుపోయాయి. ఇప్పటి వరకు ఏసీబీ ఎంట్రీ కానీ విభాగం అంటూ ఉన్నది అంటే అది కేవలం సైబర్ సెక్యూరిటీ బ్యూరో. కానీ అలాంటి శాఖలోనూ లంచావతరాలు ఉన్నారని ఏసీబీ దాడులతో బట్టబయలైంది. హైదరాబాద్ లోని ఆఫీస్ లో గల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రదాన కార్యాలయంలో అవినీతి నిరోదక శాఖ శనివారం దాడులు నిర్వహించింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న మహేంధర్ బాధితుడి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సైబర్ బాధితులను కూడా పోలీసులు వదలకుండా లంచాల కోసం వేదిస్తున్న విషయం ఏసీబీ రైడ్ తో బట్టబయలైంది. కేసు విషయంలో బాధితుడిని వేదిస్తుండడంతో పక్కా ప్లాన్ ప్రకారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. సైబర్ సెక్యూరిటీ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. మహేంధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ కమిషనరేట్ జిల్లా పోలీస్ బాసుల కార్యాలయాలకు అనుబంధంగా సైబర్ సెక్యూరిటి సెల్ పని చేస్తుండగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఏమిటి అని చర్చ మొదలైంది.

