28.8 C
Hyderabad
Monday, August 3, 2026

పాలు కావాలని చెప్పి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు

Must read

📰 Generate e-Paper Clip

రూ.2.82 లక్షలు కాజేసిన వైనం

గాంధారిలో వెలుగు చూసిన ఘటన

కామారెడ్డి, బతుకమ్మ : పాలు కావాలని చెప్పి  ఓ వ్యాపారిని  సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. వ్యాపారి ఖాతా నుంచి రూ.2.82 లక్షలు కాజేశారు. ఈఘటన గాంధారి మండల కేంద్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండల కేంద్రానికి చెందిన పాల వ్యాపారి నారాయణరావుకు గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ఆర్మీ అధికారులము పాలు కావాలని సైబర్ నేరగాళ్లు నమ్మించారు. మండల కేంద్రంలోని గురుకుల ఏకలవ్య పాఠశాలలో శిక్షణ కోసం రెండు నెలలు వచ్చామని పేర్కొన్నారు. పాల కోసం కొంత అడ్వాన్స్ చెల్లిస్తామని నమ్మించి బ్యాంకు అకౌంట్ వివరాలు పంపాలని సూచించారు. దీంతో వారి మాటలు నిజమైన నమ్మిన వ్యాపారి బ్యాంకు ఖాతా వివరాలు పంపాడు. దీంతో సైబర్ నేరగాళ్లు అతని ఫొన్ నంబర్ కు ఓటీపీని పంపారు. ఓటీపీ తెరవగానే విడతల వారీగా కలిపి రూ.2.82 లక్షలు డెబిట్ అయినట్లుగా ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన వ్యాపారి నారాయణరావు 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక గాంధారి పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article