తేయూలో సివి రామన్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం సివి రామన్ జన్మదిన వేడుకలు ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించవలసింది మానవ కల్యాణానికే కానీ మారణ హోమానికి కాదని సివి రామన్ తెలిపారని కొనియాడారు. విశ్వవిద్యాలయాలు లోతైన శాస్త్రీయ పరిశోధన నిర్వహించి సమాజానికి దిక్సూచిగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్,వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ,పి ఆర్ ఓ...