28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జీలుగ విత్తనాలు సాగుచేసి భూమి సాంద్రత పెంచుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుండిగళ్ళ నర్సింలు

 

బతుకమ్మ, నాగిరెడ్డిపేట : రాబోయే వానా కాలంలో రైతులు భూమికి సాంద్రతను పెంచే పచ్చి రొట్టె విత్తనాలను సాగు చేసుకోవాలని మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగళ్ళ నర్సింలు అన్నారు. సోమవారం మాల్ తుమ్మెద సొసైటీ కార్యాలయంలో రాయితీపై వచ్చిన జీలుగ విత్తనాలను మండల వ్యవసాయ అధికారి, సొసైటీ డైరెక్టర్ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దుండిగళ్ళ నర్సింలు మాట్లాడుతూ జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో వ్యవసాయ విస్తీర్ణ అధికారుల వద్ద ధ్రువీకరణ పత్రాలు రాయించుకొని తీసుకోవాలన్నారు. రైతులు 30 కిలోల జీలుగ విత్తనాల బస్తాను రాయితీపై 2137.50 రూపాయలు చెల్లించి పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ వంశీకృష్ణ గౌడ్, సొసైటీ సీఈవో సందీప్ రైతులు ఉన్నారు.

More articles

Latest article