జీలుగ విత్తనాలు సాగుచేసి భూమి సాంద్రత పెంచుకోవాలి
మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుండిగళ్ళ నర్సింలు బతుకమ్మ, నాగిరెడ్డిపేట : రాబోయే వానా కాలంలో రైతులు భూమికి సాంద్రతను పెంచే పచ్చి రొట్టె విత్తనాలను సాగు చేసుకోవాలని మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్ దుందిగళ్ళ నర్సింలు అన్నారు. సోమవారం మాల్ తుమ్మెద సొసైటీ కార్యాలయంలో రాయితీపై వచ్చిన జీలుగ విత్తనాలను మండల వ్యవసాయ అధికారి, సొసైటీ డైరెక్టర్ లతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ దుండిగళ్ళ నర్సింలు మాట్లాడుతూ జీలుగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాసు...