27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎస్ఐ అక్రమాలపై విచారణ జరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సిఎస్ఐ చర్చిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినట్లు రాపల్లి బాబీ ప్రసాద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిఎస్ఐ చర్చిలో పాస్టర్ మన్నె శ్రీనివాస్, ప్రభు కిరణ్ లల్లుతో కుమ్ముక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చర్చి నిర్మాణానికి రూ. కోటి ఖర్చయినట్లు చెప్పడంతో నిర్మల హృదయను ప్రశ్నిస్తే సభ్యునిగా తొలగించారని పేర్కొన్నారు. ఈమధ్య స్టాలిన్ అనే వ్యక్తి నన్ను చంపివేస్తానని బెదిరిస్తున్నందున పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎస్సీలుగా కొనసాగుతూ ఉద్యోగాలు చేస్తూ పాస్టర్ గా ఉంటూ లబ్ధి పొందుతున్న విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వేల్పూర్ మండలం పచ్చల నడకుడలో ఉపాధ్యాయునిగానున్న జూల దేవానంద్ బాల్కొండలో చర్చిలను ఏర్పాటు చేసి పాస్టర్ గా కొనసాగుతున్నందున తన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి సస్పెండ్ చేశారని చెప్పారు. ఎస్సీ కులస్తులుగా కొనసాగుతూ చర్చిలలోని పదవులలో కొనసాగుతున్నారన్నారు. క్రైస్తవేతరులు 80 శాతం మంది ఎస్సీ సర్టిఫికెట్లు పొంది రెండు విధాలుగా లబ్ధి పొందడం వల్ల క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో విచారణ జరిపి నిజమైన క్రైస్తవులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. తనను చంపి వేస్తానని బెదిరిస్తున్న స్టాలిన్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

More articles

Latest article