సీఎస్ఐ అక్రమాలపై విచారణ జరిపించాలి

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ సిఎస్ఐ చర్చిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేసినట్లు రాపల్లి బాబీ ప్రసాద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిఎస్ఐ చర్చిలో పాస్టర్ మన్నె శ్రీనివాస్, ప్రభు కిరణ్ లల్లుతో కుమ్ముక్కై అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చర్చి నిర్మాణానికి రూ. కోటి ఖర్చయినట్లు చెప్పడంతో నిర్మల హృదయను ప్రశ్నిస్తే సభ్యునిగా తొలగించారని పేర్కొన్నారు. ఈమధ్య స్టాలిన్ అనే వ్యక్తి నన్ను చంపివేస్తానని బెదిరిస్తున్నందున...