30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎస్ఐ చర్చిలో ప్రజాపాలన ఉత్సవాల ఇన్ చార్జీకి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన ఉత్సవాల ఇన్ చార్జి సముద్రాల వేణుగోపాలచారి, నుడా చైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ ను ఘనంగా సన్మానించారు. రాష్ర్ట ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని, చర్చిల మరమ్మతులకు కృషి చేస్తుందని, ఎటువంటి సమస్యలున్నా నుడా చైర్మన్ కేశ వేణు దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు రీవా జార్జ్, ఇన్ చార్జి రెవా ప్రకాశ్, రెవ కృపాకర్, ప్రధాన కార్యదర్శి సుధీర్, కాంగ్రెస్ నాయకుడు బెన్సన్(బెన్నీ) తదితరులు పాల్గొన్నారు. 

More articles

Latest article