బతుకమ్మ, ఏర్గట్ల :
తాళ్ల రాంపూర్ వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 5 నుంచి 6 కిలోలు కడ్తా తీసుకునేవారని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలన్నా వాళ్ళ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు పూర్ణానందం విమర్శించారు. ఒక పక్క రైతులు పండించిన వరి పంటను రోడ్ల పైన ఆరబెట్టి అమ్ముడుపోక పడికాపులు కాస్తున్న పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు కడ్తా విషయంలో గత ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని, ఇప్పటికీ ఉన్న పంటకు ప్రభుత్వం ఇస్తామన్నా 500 రూపాయల బోనస్ ఇవ్వకపోగా పైగా విమర్శలు చేయడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. సన్న వడ్లతో పాటుగా దొడ్డు వడ్లను కూడా కొని హామీ ప్రకారంగా 500 రూపాయల బోనస్ వెంటనే రైతులకు చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులను నిలువెత్తిన ముంచిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని రైతులకు ఇప్పటికే అర్థమయిపోయిందని, ఎన్నికల ప్రచారంలో ఇదే అన్వేష్ రెడ్డి మాట్లాడిన మాటలకు కట్టుబడి ప్రస్తుతం రైతులు అనుభవిస్తున్న కష్టాలకు పూర్తి బాధ్యతలు తీసుకోని పండిన దొడ్డు,సన్నా,వడ్లను రైతు పండించిన ప్రతి గింజను కొనాలి అంతేకాకుండా వారికి మద్దతు ధర తో పాటుగా 500/ రూపాయలు బోనస్ ఇప్పించాలి లేదంటే రైతులు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.కాంగ్రెస్ నాయకులు అసత్య మాటలు బంద్ చేసి క్షేత్ర స్థాయిలో రైతులను పట్టించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పూర్ణ నందం, గ్రామ శాఖ అద్యక్షులు బొనగిరి రమేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అశోక్ యాదవ్, నేరెళ్ళ దేవన్న, గంగాధర్, అడెల్లి, తదితరులు పాల్గొన్నారు.
