27.5 C
Hyderabad
Friday, July 31, 2026

 ఉద్యోగులందరూ సంఘాటితంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ 

బతుకమ్మ, ముప్కాల్  : 

 

ఉద్యోగులందరూ సంఘటితమై ఉద్యోగుల హక్కుల సాధన కొరకై కృషి చేద్దామని టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. ముప్కాల్ మండల కేంద్రం లో ఎస్సారెస్పి టీఎన్జీవో యూనిట్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. సభ్యత్వ నమోదు ప్రాముఖ్యతను తెలియజేసి, యూనిట్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి, టీఎన్జీవో జిల్లా కార్యాలయం నందు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. సమస్యలు ఏమైనా ఉంటే  వాటిని రెండు, మూడు రోజుల్లో  సమస్యలను విడతలవారీగా పరిష్కరించుటకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవో నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఎస్సారెస్పి యూనిట్ పక్షాన  ఎన్.సుమన్ కుమార్ ను జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ లను శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేసి శుభాకాంక్ష లు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు , జాకీర్ హుస్సేన్, జాఫర్ హుస్సేన్,ఉమా కిరణ్, మాణిక్యం, నిరంజన్ గౌడ్, ఎస్సారెస్పి యూనిట్ మాజీ అధ్యక్షులు జాన్ సుభాకర్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు , వనమాల సుధాకర్, టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ పక్షాన శశికాంత్ రెడ్డి,  వెటర్నని శాఖ గంగరాజు , వివిధ శాఖల నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

All employees should be unionized

More articles

Latest article