. . . ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాదు పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ ఈద్గాలు, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లను శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, ప్రజలకు క్షేత్రస్థాయి నుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్, భద్రత చర్యలను ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాల న్నారు. పండుగ దృష్ట్యా మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో షీ టీమ్స్ ద్వారా నిఘా ఉంచడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి , ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డి, సిఐలు , ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

