మన్సిపల్ కార్పొరేషన్ లో బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసే సమావేశం సందర్భంగా బందోబస్తును సీపీ సాయిచైతన్య ఆదివారం స్వయంగా పరిశీలించారు. నిజామాబాద్ లో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ నెల 16న సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను సీపీ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేలా చూడాలని,...