24.7 C
Hyderabad

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

More articles

Latest article