ఆర్మూర్, బతుకమ్మ :
ముప్కాల్ మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ భవనం ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన కార్యాలయ గదులు, రిసెప్షన్ సెంటర్, రికార్డు గదులు, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి జె.వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, సి.సి.ఆర్.బి ఇన్స్ పెక్టర్ ఆర్.అంజయ్య, ముప్కాల్ ఎస్.ఐ కిరణ్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
