ముప్కాల్ లో నూతన పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించిన సీపీ
ఆర్మూర్, బతుకమ్మ : ముప్కాల్ మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, సౌకర్యాల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ భవనం ప్రజలకు సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడాలని సూచించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, పనులను వేగవంతంగా...