పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లను అభినందించిన సీపీ
నిజామాబాద్ క్రైం,బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభింనందించారు. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన ఏడుగురు కానిస్టేబుళ్లు గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన కె.గంగాప్రసాద్, మోపాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన కె.ఉషా శేఖర్, నగరంలోని రెండో టౌన్...