- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. డీఎంఎఫ్టీ నిధులతో ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాల ఆవరణలోను, తంగళ్ళపల్లి స్వామి వివేకానంద కాలనీ, పాత వాడ లలో నూతనంగా నిర్మించిన 3 అంగన్వాడీ కేంద్రాల భవనాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కే కే మహేందర్ రెడ్డి తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో మొత్తం 585 అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ. 20 కోట్లతో జిల్లాలోని ఆయా మండలాల్లో మొత్తం 170 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో మొత్తం 49, ఎల్లారెడ్డిపేట మండలంలో మొత్తం 9 కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అన్ని భవనాలు రానున్న ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొదటి అంగన్వాడీ కేంద్రాన్నీ కిషన్ దాస్ పేటలో ప్రారంభించామని వివరించారు. భవనం త్వరగా పూర్తి చేసేలా విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.ప్రీ ప్రైమరీ విద్య బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు ఆడుతూ…పాడుతూ విద్యను అభ్యసించే అవకాశం వస్తుందని వివరించారు. అనంతరం అంగన్వాడి పిల్లల చేత గేయాలను పాడించి వారితో ముచ్చటించారు, తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వాల్ పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఈ.ఈ పి.ఆర్ సుదర్శన్ రెడ్డి, తహాసిల్దార్లు, ఎంపీడీవోలు, స్థానిక నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ బాయ్, జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

