నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని అంబేడ్కర్ కాలనీలో టీఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నరాల రత్నాకర్ హాజరై జెండా ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని తెలిపారు. టీఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాల గోవర్ధన్, టీఎమ్మార్పీ ఎస్ నిజామాబాద్ ప్రధాన కార్యదర్శి డి. హరీష్ మాదిగ, పట్టణ అధ్యక్షులు బండారి పల్లి మల్లేష్ మాదిగ, బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మోహన్ మాదిగ,
మాదిగ మహిళ సమైక్య నాయకులు జ్యోతి మాదిగ ,
పద్మ మాదిగ, రాధ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ అఖిల్ మాదిగ , సాయి , నరేష్, అరవింద్, కాలనీవాసులు గిరి మాదిగ , లక్ష్మణ్ మాదిగ, రాఘవేందర్, దీపు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post