- బాన్సువాడ పట్టణ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
బాన్సువాడ, బతుకమ్మ : కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు గంట సేపు రాస్త రోకో చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఫ్రీ బస్సు తప్ప ఇప్పటివరకూ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.ఈ కార్యక్రంలో సీనియర్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, మోచి గణేష్, సాయిబాబా, చందర్, శివసూరి, రమేష్ యాదవ్, సకాలి సాయిలు, మౌలా, మహేష్,బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
