. . . ఘనంగా మొక్కులు తీర్చుకున్న భక్తులు
ఇందల్వాయి, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గౌడ సంఘ సభ్యులు నూతనంగా నిర్మించిన రేణుక పుట్ట ఎల్లమ్మ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమం భక్తిపారవశ్య వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లోకని గంగామని గంగారం, ఉపసర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, భవానిపేట్ గంగాధర్, మాజీ ఎంపీటీసీ గంగాధర్ గౌడ్, నవీన్ గౌడ్, మల్లేష్ గౌడ్, కిరణ్ గౌడ్, రవి గౌడ్, నారా గౌడ్, దాసు గౌడ్, మోహన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, పోచయ్యతో పాటు గ్రామ పెద్దలు, గౌడ సంఘ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
