నూతన రేణుక పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
. . . ఘనంగా మొక్కులు తీర్చుకున్న భక్తులు ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గౌడ సంఘ సభ్యులు నూతనంగా నిర్మించిన రేణుక పుట్ట ఎల్లమ్మ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, గుమ్మడికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...