25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోషి

 

కామారెడ్డి, బతుకమ్మ : సర్పంచ్ ఎన్నికల్లో బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ ప్రదర్శిస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోషి అన్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్నారు. జీవో నం.46 ప్రకారం 50% రిజర్వేషన్లతో స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల పంచాయతీలు యథాతథంగా ఉండగ, 22% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తుండటంతో పలుచోట్ల బీసీ రిజర్వేషన్లకు మాత్రమే అన్యాయం జరిగిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 22 శాతం ఇచ్చి పబ్బం గడుపుకుంటుందని స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సముచిత న్యాయం కలిపించకుంటే బీసీ రాజ్యాధికార పార్టీ పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు  రెండు కూడా బీసీలపై మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే బీసీలు చూస్తూ ఊరుకోరని బీసీలంతా ఏకమైతే రాజ్యాధికారం బీసీల దేనని ఈ విషయాన్ని పెత్తందారులు బడా నాయకులు గుర్తుంచుకోవాలని తెలిపారు.

More articles

Latest article