. . . బీజేపీ ఆధ్వర్యంలో కౌంటర్ ధర్నా
. . . రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిష్టిబొమ్మ దహనం
భిక్కనూర్, బతుకమ్మ :
నీట్ పరీక్షల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు గురువారం సాయంత్రం భిక్కనూరు మండల కేంద్రంలో కౌంటర్ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పారదర్శకంగా నీట్ పరీక్షలు నిర్వహిస్తోందని, అయినా కాంగ్రెస్ నేతలు దొంగ రోహింగాలను పెట్టుకొని దిష్టిబొమ్మలు దహనం చేస్తూ విద్యార్థులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్ విమర్శించారు. పేపర్ లీకేజీపై ఇప్పటికే కేంద్రం నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారని పేపర్ లీక్ చట్టం కింద విచారణ చేస్తారన్నారు. నీట్ పై సమగ్ర విచారణకు ఆదేశించిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, విద్యార్థుల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్తిలి తిరుమలేష్, లింగారెడ్డి, భాస్కర్, పవన్ కళ్యాణ్, పెండ్యాల నవీన్, శ్రీనివాస్, రమేష్ రెడ్డి, రంజిత్ లు ఉన్నారు.

