ఆకుల శ్రీకాంత్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

0 15,647

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీకాంత్ గౌడ్ ( 32  )  బ్రతుకు దెరువు  కోసం  ఒమన్ వెళ్లి అనారోగ్యంతో ఈ నెల 20 వ తేదీన   మరణించాడు.ఈ విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, ఏఎంసి వైస్  ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి,గల్ఫ్ బాధితుల సంఘం మండల అధ్యక్షుడు లాలాబాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్రెడ్డి మేండే శ్రీనివాస్ యాదవ్,  పందిల్ల సుధాకర్ గౌడ్, సురేందర్ లు  శనివారం వెళ్లి  అతని తండ్రి అంజ గౌడు తల్లి లక్ష్మీలను  పరామర్శించారు.బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అనారోగ్యంతో అక్కడ మరణించిన  బాధిత కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి  అమలు చేస్తున్నందున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి లతో మాట్లాడి  ఇప్పించడానికి కృషి చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాట్టి నరసయ్య చెప్పారు.అందుకు సంబంధించిన ఫైల్ ను  తమకు  ఇవ్వాలని కుటుంబ సభ్యులను అడిగారు.

Leave A Reply

Your email address will not be published.