. ఆయన పోస్టులో తప్పేమీ లేదు..
. గుజరాత్ పోలీసుల పిటిషన్ పై సుప్రీం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, బతుకమ్మ: గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హిపై ఆ రాష్ర్ట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ‘హే ఖూన్ కే ప్యాసే బాత్ సునో..’ అంటూ ప్రతాప్ గర్హి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఏఎస్ ఓకా విచారణ చేపట్టారు. గర్హి చేసిన పోస్టు ‘నిజానికి అహింసను ప్రోత్సహిస్తుంది. దీనికి మతంతో సంబంధం లేదు. అంతకంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు‘. అని పేర్కొన్నారు.
