23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: హరీశ్ రావు

Must read

📰 Generate e-Paper Clip

ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం..

11 కిలోమీటర్లకు పైగా తవ్వాం

మీతో కాకపోతే చెప్పండి మేము రెస్క్యూ చేసి చూపిస్తాం

వెబ్ న్యూస్, బతుకమ్మ: ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లకు పైగా తవ్వామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చకు ఎక్కడికైనా  రమ్మంటే వస్తానని సవాల్ విసిరారు. తాను చేసింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఎస్‌ఎల్‌బీసీలో పనులు చేయాలి కానీ మమ్మల్ని అంటే ఎలా?.. అని,  గతంలో కాళేశ్వరం విషయంలోనూ ఇలానే మాట్లాడారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాకు అప్పగించండి మేము చేసి చూపిస్తాం అంటే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. ఎస్‌ఎల్‌బీసీలో 10 రోజులైనా మృతదేహాలను వెలికితీయలేదని విమర్శించారు. మీతో కాకపోతే చెప్పండి మేము రెస్క్యూ చేసి చూపిస్తామని వెల్లడించారు.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై సీఎంకు ఫోకస్ లేదన్నారు. ఈ విషయాలన్నీ అసెంబ్లీలో ఎండగడతామన్నారు.

More articles

Latest article