28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంబేద్కర్ ని అడుగడుగునా కాంగ్రెస్ అవమానించింది

Must read

📰 Generate e-Paper Clip

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  డా.బీ.ఆర్. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కంటేశ్వర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన  సంవిధాన్  గౌరవ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావొస్తున్న సందర్బంగా బిజెపి గల్లీ నుండి ఢిల్లీ వరకు “హమారా సంవిధాన్” “హమారా స్వాభిమాన్ “ అనే నినాదంతో సంవిధాన్ గౌరవ అభియాన్ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి, ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం, అందించే లక్ష్యంతో మనకు హక్కులను , విధులను కల్పించి రాజ్యాంగం అనే పవిత్ర గ్రంథం  అందించిన  డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. నేటి తరం, రాబోయే తరాలు రాజ్యాంగాన్ని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంబేద్కర్ కలలు కన్న సమసమాజం ఏర్పడలన్నా ప్రతి పౌరునికి స్వేచ్ఛ, సమానత్వం అందాలన్న రాజ్యాంగం గురించి, అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు ఆనంద్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంకర్ లక్ష్మి నారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు కొండా ఆశన్న, మాయావర్ సాయిరాం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Congress insulted Ambedkar at every step

More articles

Latest article