నగర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగటం నా పూర్వజన్మ సుకృతం

0 1,955

. . . నగర మేయర్ ధండు నీతు కిరణ్

నిజామాబాద్:

ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు సేవ చేసే అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతం అని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నగర పాలక సంస్థ పాలకవర్గం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకుంటున్న సందర్బంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు నిజామాబాద్ నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో మేయర్ మాట్లాడుతూ.మేయర్ గా పనిచేయడం చాలా ఆనందం కలిగించిందని ఈ అవకాశాన్ని కల్పించిన మాజీ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ కుప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ద్వారా ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించే క్రమంలో రాత్రినక పగలనక కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా అండగా నిలిచిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది కార్మికులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదములు తెలిపారు.

My antecedents were blessed with the fortune of serving the people of the city

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను పాలకులు నిర్లక్ష్యం చేశారు… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

రాష్ట్రంలో అతి పెద్ద నగరాలలో నిజామాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. అయినప్పటికీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం గజ్వెల్ కి ఇచ్చిన ప్రాముఖ్యం ఇందూర్ కార్పొరేషన్ కి ఇవ్వలేదు.ప్రస్తుతం కాంగ్రెస్ కొడంగల్ కి ఇచ్చిన ప్రాముఖ్యం ఇందూర్ కార్పొరేషన్ కి ఇవ్వడం లేదు.కార్పొరేషన్ అభివృద్ధికి పార్టీలకుఅతీతంగా కృషి చేయాలి. తాను ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి నగరంలో పెండింగ్ లో ఉన్న ఇంటిగ్రెటెడ్ మార్కెట్, ఫ్లైఓవర్ పనుల పైన దృష్టి పెట్టడం జరిగింది.అలాగే నగర అభివృద్ధికి స్పెషల్ ఫండ్ కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరాను. కార్పొరేటర్స్ గా ఐదు సంవత్సరాలు ఇందూర్ ప్రజలకు సేవలు అందించిన కార్పొరేటర్స్ అందరిని అభినందించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మళ్ళీ ఇందూర్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అకాంక్షించారు.

My antecedents were blessed with the fortune of serving the people of the city

ఎమ్మెల్యేగా నా హయంలో నిజామాబాద్ నగరం లో డెవలప్మెంట్ పనులు జరిగాయి.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా

నిజామాబాద్ నగరంలో కమిట్మెంట్ తో పనిచేసి నిజామాబాద్ ని అభివృద్ధి పథంలో ఉండే విధంగా చూశాం.. మున్సిపల్ 13 కోట్ల విద్యుత్ బకాయాలను కట్టి జీరో చేశాం.నగరంలో ఎక్కడ లేని విధంగా మినీ ట్యాంక్ బండ్ , ఐటి హబ్, వైకుంఠధామాలు, అర్బన్ పార్కులు,సెంటర్ మీడియన్స్ లైటింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మిస్టర్ డెవలప్మెంట్ అని నన్ను పిలిచేవారు అని తెలిపారు..పదవి కాలం ముగుయడం అంటే అంటే అయిపోయిందని కాదు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు ప్రజా ఆశీర్వాదం తో గెలిచి మళ్ళీ అభివృద్ధిలో ముందుండాలని అన్నారు..

My antecedents were blessed with the fortune of serving the people of the city

 

ఈ సందర్బంగా కార్పోరేటర్లను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబెర్స్, కమిషనర్ దీలిప్ కుమార్ , ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.