అంబేద్కర్ ని అడుగడుగునా కాంగ్రెస్ అవమానించింది
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: డా.బీ.ఆర్. అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కంటేశ్వర్ మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు కావొస్తున్న సందర్బంగా బిజెపి గల్లీ నుండి ఢిల్లీ వరకు “హమారా సంవిధాన్” “హమారా స్వాభిమాన్ “ అనే నినాదంతో సంవిధాన్ గౌరవ అభియాన్ నిర్వహించుకోవడం జరుగుతుందని...