కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో శనివారం ఇందల్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకర సంగం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో నమ్మి మోసపోవద్దని తెలిపారు. నేరుగా కొనుగోలు కేంద్రానికి వరి దాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు చేసుకునే విధంగా చూసుకోవాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు ఒక కోటి 25 లక్షల...