27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జిహెచ్ఎంసీ అవినీతిలో బిఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టెండర్లు లేకుండానే 1148 కోట్ల పనుల అప్పగింత

 

. . . జీహెచ్ఎంసీ లో అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడు

 

. . . అవినీతిపై త్వరలో ఈడికి ఫిర్యాదు చేస్తాం

 

. . . తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ:

 

జీహెచ్ఎంసీ హెచ్ఎండీఏలో పనులన్నీ టెందర్ల ద్వారానే ఇవ్వాలి. కానీ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 480 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు నామీనేషన్ ప్రాతిపదికన ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే మాదిరిగా 1148 కోట్లు పూర్తిగా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ లు ఇచ్చారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు అని అన్నారు. సీఎం తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్నడు అని తెలిపారు. జీహెచ్ఎంసీ లో కాంగ్రెస్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని,  వెంటనే నామినేషన్ల పద్దతిని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్దతిలో టెండర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినేషన్ల పద్దతిలో కాంట్రాక్ట్ లు ఇవ్వవద్దని 2023 లోనే వేసిన కమిటీ స్పష్టం చేసింది. అయినా సరే ఈ ముఖ్యమంత్రి 1148 కోట్లు నామినేషన్ పద్దతిలో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. రూ. 50 కోట్లు దాటితే కచ్చితంగా టెండర్ పిలవాల్సిందే. టెండర్లు పిలవటం కారణంగా మళ్లీ సగం వరకు కూడా ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది. హెచ్ఎండీఏ కు ముఖ్యమంత్రే చైర్మన్, మున్సిపల్ మంత్రి వైస్ చైర్మన్ ఉంటాడు. కానీ మన ఖర్మ కొద్దీ ఈ ముఖ్యమంత్రి నేనే రాజు,  నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యనించారు. రియల్ ఎస్టేట్ సంస్థలను ఇప్పటికే హైడ్రా పేరుతో బెదిరించారు. స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయల చొప్పున వారి వద్ద వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరించటమనేది వెంటనే మానుకోవాలని లేదంటే మీ అవినీతి పై ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం మరమ్మత్తులను కమీషన్ల కోసమే చేస్తున్నారని, కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు.. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ హయాంలో జరుగుతున్న మహా కరెప్షన్ అని చెబుతున్నాం. ఈ అవినీతిని ఇంకా పెంచుకోవటానికి మీరు ఫ్యూచర్ సిటినీ ముందుకు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు హైదరాబాద్ సిటీ ని డెవలప్ చేయాలి. మీ అవినీతి కోసం హైదరాబాద్ సిటీ ఫ్యూచర్ ను నాశనం చేయవద్దని ముఖ్యమంత్రిని కవిత హెచ్చరించారు..

 

Congress follows BRS in GHMC corruption
Congress follows BRS in GHMC corruption

 

. . . ఎంపీ అర్వింద్ కు తెలివి లేదు… నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు

మహిళ బిల్లుకు 2011 జనాభా లెక్కలు ప్రతిపాదిక అంటే మోసం చేయటమే అని కల్వకుంట్ల కవిత అన్నారు. బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటోంది అన్నారు.  ఎంపీ అర్వింద్ కు తెలివి లేదు. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు అని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయంప్రతిపత్తి కలిగి ఆలోచన శక్తి ఉన్నవాళ్లు.  నేను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో బతికి…ప్రజల మధ్యలో ఉండేందుకు వచ్చాను.  నాలాంటి వాళ్లను ఎవరో మద్దతిస్తే బతుకుతానని అనటం ఆయన పురుషాహంకారానికి నిదర్శనం.మళ్లీ అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అర్వింద్ ను హెచ్చరిస్తున్నా అని కవిత అన్నారు.. మహిళ బిల్లుకు మీద పాత సెన్సెస్ అప్లయ్ చేయాలని అనుకోవటం అన్యాయం.  ఇప్పటికే మొన్నటి లోక్ సభ ఎన్నికలతో పాటు 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మా అవకాశాలు పోయాయి అని అవేధన వెలి బుచ్చారు. 2027 జనాభా లెక్కల వరకు ఆగితే మహిళలకు సీట్లు పెరుగుతాయని మా ఆలోచన. ఈసారి జనాభా లెక్కల్లో బీసీల జనగణనన కూడా చేస్తామని చెప్పారు. దాని ద్వారా బీసీ మహిళలకు కూడా అవకాశాలు వస్తాయని మేము భావించాం. కానీ బీజేపీ అప్పటి వరకు ఆగకుండా బీసీల పట్ల తమకు ఉన్న వ్యతిరేకతను చాటుకుంటోంది. బీసీ బిడ్డలు, ఆడబిడ్డలు దీని మీద పోరాటం చేయాలి అని పిలుపు నిచ్చారు. 2027 తర్వాత మహిళ రిజర్వేష్లన్లు అమలు చేస్తే మంచి అవకాశాలు వస్తాయి.  ఇక డ్రాఫ్ట్ బిల్లు గురించి మేము కూడా స్టడీ చేస్తున్నాం. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తాం అని కవిత తెలిపారు.తెలంగాణ కు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని చెప్పేందుకే నేను వీడియో సందేశం రిలీజ్ చేశా. కాంగ్రెస్ చేసిన మోసాన్ని కేరళ ప్రజలు గుర్తించి అక్కడ లిబరల్ ఫ్రంట్ ను గెలిపిస్తే నేను సంతోషిస్తా అన్నారు.

 

Congress follows BRS in GHMC corruption

 

. . . జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 21 కమిటీలు వేశాం

తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమం ఏప్రిల్ 25న జరిగే కార్యక్రమా నిర్వహణకు 21 కమిటిలు వేసినట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. ప్రతి కమిటీలో 30 మంది సభ్యులు ఉంటారు. వాలంటీర్లు 500 మంది ఉంటారు. సభ సజావుగా జరిగిలే ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు కమిటీ సభ్యులు చర్యలు తీసుకుంటారు.  కమిటీ వివరాలన్ని కూడా ఆన్ లైన్ లో ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయి.  ఏ మాత్రం అనుమానం ఉన్న సరే కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరుతున్నా అని తెలిపారు.

More articles

Latest article