బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ మున్సిపాలిటీ 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నార్ల వసంతకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి హామీలు ఇచ్చారు. వార్డు అభివృద్ధి కోసం అభ్యర్థి నార్ల వసంత నందకిషోర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని 14వ వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు.
