హైదరాబాద్, బతుకమ్మ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో వేధిస్తున్నారని పార్టీ నేతలు ఆరోణలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం నిరసనలకు సిద్ధమయ్యారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. మహేశ్‌కుమార్, మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ శ్రేణులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. నిరసనకు పోలీసులు నిరాకరించడంతో వారు అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇది శాంతియుత ధర్నా..అని, ఇప్పటికైనా మోదీ తన తప్పు తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులు గాంధీభవన్ గేట్ల పైకెక్కి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు గాంధీ భవన్ గేట్లు మూసివేశారు.

–