హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయాన్ని గురువారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కుతరలించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో వేధిస్తున్నారని టీపీసీసీ నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
