- బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యం
- బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం లో రాష్ట్రములో బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ బీజేపీ లు వ్యతిరేకం అని,43 ఏండ్లపాటు దేశం లో బీసీలకు రిజర్వేషన్ లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీ లు కుట్ర చేశాయని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడారు. బీఎస్పీ ద్వారా మాత్రమే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల బహుజనులకు హక్కులు లభించాయి అన్నారు. రాష్ట్రం లో బీసీ కుల గణన చేసి 56% బీసీ ల జనాభా అని చెప్పి 42% రిజర్వేషన్ లు ప్రకటించిన ముక్యమంత్రి కి బీసీ రిజర్వేషన్ ల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు. నాడు బీఎస్పీ పోరాటం పోరాటం వలన మండల్ కమిషన్ అమలు అయిందని అన్నారు. మండల్ కమిషన్ ని అడ్డుకోవడానికి బీజేపీ ఏబీవీపీ విద్యార్థులకు నిప్పు పెట్టి బీసీ రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన చేసిందని గుర్తు చేశారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందని అన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం బహుజనులకు రాజ్యాధికారం కోసం ప్రజలు అందరూ బెహన్ జీ మాయావతి గారి నాయకత్వం లో పని చేయాలని అన్నారు. బీసీ లకు చట్ట సభల్లో రిజర్వేషన్ లు కల్పించాలని, దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని, బీసీ లకు స్థానిక సంస్థల్లో జనాభా దమాషా న రిజర్వేషన్ లు కల్పించాలని అయన డిమాండ్ చేశారు. బీఎస్పీ ని గ్రామ స్థాయి లో బలోపేతం చేసి, కమిటీ లలో యువకులకు బీసీ లకు బీఎస్పీ వల్లనే రాజ్యాంగం రక్షించబడుతుందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ బహుజనులు రాజ్యాధికారం సాధించక పోతే శాశ్వత బానిసలుగా మారిపోతారని అన్నారు. పార్టీ ని బూత్ కమిటీ ల వరకు నిర్మించాలని అన్నారు. ఈ సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి గైని గంగాధర్ , రాష్ట్ర కార్యవర్గసభ్యులు నీరడి ఈశ్వర్ జిల్లా అధ్యక్షులు సింగిడి పాండు అసెంబ్లీ ఇంచార్జిలు నీరడి రవి, యన్. శంకర్, యన్.లక్సమాన్, అసెంబ్లీ నాయకులు సెక్టార్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
