- ఎంపీడీవో, ఎమ్మార్వో లకు ఐకేపీ అధికారులపై ఫిర్యాదు
- బీజేపీ మండల ప్రెసిడెంట్ అరె రవింధర్
భీమ్ గల్ , బతుకమ్మ : భీమ్ గల్ మండలంలోని చాలా గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్డీ రాయితీ రుణాలకు సంబంధించిన, ఇతర మహిళా సంఘాల కార్యక్రమాలలో ప్రోటోకాల్ విస్మరించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు అయిన అధికారులు అధికార పార్టీకి చెందిన నాయకులను ఆహ్వానించి వారి చేత కార్యక్రమంలో ప్రసంగింప చేస్తూ వడ్డీ రాయితీ రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా నాయకుల చేతుల మీదుగా అందిస్తూ ప్రొటోకాల్ ను విస్మరిస్తున్నారని మండల బీజీపీ ప్రెసిడెంట్ అరె రవింధర్ అరోపించారు. ఈమేరకు బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండల తహశీల్దార్ షభ్బీర్ , ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్లకు ఫిర్యాదు చేశారు. న్యూస్ పేపర్ కటింగ్ లతో ఫిర్యాదు పత్రాన్ని జత చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బద్దంగా పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను పిలిచి జరపల్సిన ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాలకు రాజ్యంగా బద్ద పదవులు లేని వారిని అతిథులుగా పిలుస్తూ ప్రొటోకాల్ ను విస్మరిస్తున్నరని అన్నారు. ఈనెల 6న సికింద్రాపూర్ గ్రామంలో జరిపిన ఐకేపీ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులను పిలిచి వారి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారన్నారు. ఇక పై ఇలాంటి ప్రొటోకాల్ సమస్య రాకుండా ప్రజలకు నేరుగా చేరే విధంగా కార్యక్రమాలను జరపాలని రవింధర్ మండల అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు రామావత్ వెంకటేష్, శక్తి కేంద్ర ప్రముఖ్ హరి ప్రసాద్, దడివే లక్ష్మీ నారాయణ, బీజేవైఎం నాయకులు శెట్టి ప్రేమ్ చంద్ పాల్గొన్నారు.
