29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్డీసీసీబీ డిచ్ పల్లి బ్రాంచ్ మేనేజర్ పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల లో పొదుపు సంఘాల మహిళలు,డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలు గత రెండు నెలలుగా నిబంధనల పేరుతో ఇవ్వకుండా ఎన్ డీసీసీబీ డిచ్ పల్లి మేనేజర్ బ్యాంకు చుట్టూ తిప్పుతున్నారని డిచ్ పల్లి మండల మహిళా సమాఖ్య సభ్యులు ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డికి ఫిర్యాదు చేశారు. బ్యాంకుకు వెళ్లిన మహిళలతో మేనేజర్ అసభ్యకరంగా దురుసుగా ప్రవర్తిస్తారని ఒక మహిళ అయి ఉండి సాటి మహిళలతో అమర్యాదగా వ్యవహరిస్తారని తెలిపారు. ఏదైనా సంఘం రుణము కట్టనిచో వి.ఓ.ఎ ల వ్యక్తిగత ఖాతా నుండి బెదిరించి, డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారని తెలిపారు. నాబార్డ్ నిబంధనలు ఎన్డీసీసీబి అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తవి కానీ వేరే ఆన్ డీసీసీబీ ఏ బ్రాంచ్ లో కూడా లేని నిబంధనలు పెడుతూ ఖాతాదారులను మహిళా సంఘాలను ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఎమ్మెల్యే తో తెలిపారు. మేము గతంలో ఎన్ డి సి సి బి హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయగా నాపైనే హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేస్తారా నన్ను ఎవరు ఏమి చేయలేరు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ,మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మాపై దురుసుగా మాట్లాడుతున్నారని వారు ఎమ్మెల్యే కి తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి కి చరవాణిలో మాట్లాడుతూ, అట్టి మేనేజర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలకు రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించినారు.ఈ కార్యక్రమం డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article