27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రక్షణ కల్పించాలని సీపీకి ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ ఇంటి  వద్దకు వచ్చి తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు ప్రాణ రక్షణ కల్పించాలని రుద్రూర్ మండలం అక్బర్ నగర్ కు చెందిన వడ్ల గోదావరి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన తమ్ముడు సుదర్శన్ కు రుద్రూర్ గ్రామానికి చెందిన ఉమతో గత 25ఏళ్ల క్రితం  వివాహం అయిందన్నారు. వారికి ఒక  బాబు, ఒక పాప ఉన్నారని తెలిపారు. పెళ్లి జరిగిన నాలుగేళ్లకు ఉమ సుదర్శన్ తో గొడవపడి వాళ్ల అమ్మగారి ఇంటికి వెళ్లిపోయిందని తెలిపారు. తన తమ్ముడు సుదర్శన్ అత్తమామల దగ్గరకు వెళ్లి తన భార్యా పిల్లలను పంపించాలని అడిగారని తెలిపారు. వారు ఎక్కడ ఉంటున్నారో తమకు తెలియదని చెప్పి వారిని వేరే చోట దాచి ఉంచారని తెలిపారు. దీంతో తన భార్య కాపురానికి రావడంలేదని సుదర్శన్ గత 20సంవత్సరాల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. అప్పటి నుంచి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ అక్బర్ నగర్ లో ఉంటున్నానని తెలిపారు. వారికి సేవలు చేస్తున్న క్రమంలో వేర్వేరు సమయంలో మరణించారని తెలిపారు. వారికి తన ఇద్దరు చెల్లెల్లు కలిసి అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. అయితే ఈ నెల 21న మా వదిన ఉమ, ఆమె కొడుకు భానుచందర్ అతని నలుగురు స్నేహితులు, ఉమ వాళ్ల బాబాయ్ కమ్మరి సాయిలు కలసి మా ఇంటిపైకి వచ్చి నన్ను, నా కూతురు లక్ష్మీలపై దాడి చేశారని తెలిపారు. భాను చందర్ నా కూతురు లక్ష్మీ గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడని తెలిపారు. ఈ ఘటనలో నా కూతురు మెడలో ఉన్న పుస్తెల తాడు, బంగారు గుండ్లను తెంపి లాక్కున్నారని అన్నారు. దాడి జరిగిన రోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉమా, ఆమె బందువులు వచ్చి కొందరు గ్రామ పెద్దల సమక్షంలో ఇల్లు, స్థలం విషయంలో మాట్లాడేందుకు పిలిపించారని తెలిపారు. తమను ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని, ఆస్థి మొత్తం ఉమకు చెందుతుందని తీర్పు చెప్పారని పేర్కొన్నారు.  20ఏళ్ల పాటు మా అమ్మ నాన్నలకు సేవ చేసానని, ఆస్థిలో సగం వాటా వస్తందని తెలిపారు.  తన సొంత డబ్బులతోనే రేకుల  షెడ్డు వేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తన తమ్ముడు బతికున్నప్పుడు కాపురం చేయకుండా 20 సంవత్సరాల తరువాత వచ్చి ఆస్థిమొత్తం నాదే అనడం, అందుకు పెద్దమనుషులు ఆమెకే వత్తాసు పలకడం అన్యాయం అన్నారు. మాపై జరిగిన దాడి విషయంలో స్థానిక రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఎస్ఐ పట్టించుకోలేదని తెలిపారు. తాము ఫిర్యాదు చేయడానికి ముందే కొందరు పెద్ద మనుషులు, మాపై దాడి చేసిన వారు పోలీస్ స్టేషన్ లో ఉన్నారని తెలిపారు. పోలీసులు సమక్షంలో కొందరు పెద్ద మనుషులు బలవంతంగా బెదిరించి ఒప్పంద పత్రం పై సంతకం చేయాలని బలవంతం చేశారని పేర్కొన్నారు. అయినా తాము సంతకం పెట్టకుండా బయటకు వచ్చేశామని అన్నారు. మా ఊరిలోని కొందరు పెద్ద  మనుషులు తమకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. మాపై దాడి చేసిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుని, మాకు ప్రాణ రక్షణ కల్పించాలని పోలీస్ కమిషనర్ ను కోరినట్లు తెలిపారు.

Complaint to CP seeking protection

More articles

Latest article