రక్షణ కల్పించాలని సీపీకి ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తమ ఇంటి వద్దకు వచ్చి తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు ప్రాణ రక్షణ కల్పించాలని రుద్రూర్ మండలం అక్బర్ నగర్ కు చెందిన వడ్ల గోదావరి సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన తమ్ముడు సుదర్శన్ కు రుద్రూర్ గ్రామానికి చెందిన ఉమతో గత 25ఏళ్ల క్రితం వివాహం అయిందన్నారు. వారికి ఒక బాబు, ఒక పాప ఉన్నారని తెలిపారు. పెళ్లి జరిగిన నాలుగేళ్లకు...