25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పై ప్రజావాణిలో ఫిర్యాదు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ ప్రజావాణిలో ఎక్సైజ్ శాఖ  సూపరింటెండెంట్ హనుమంతరావు పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్  మీడియాతో మాట్లాడుతూ రెడ్డిపేట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్, ఐడి, ధ్రువ పత్రాలను సృష్టించి కరడ్ పల్లి గ్రామంలో కల్లు దుకాణం లైసెన్సు పొందారని సంపత్ గౌడ్ ఆరోపించారు. ఈ విషయంపై పలుసార్లు జిల్లా ఎక్సైజ్ శాఖ  అధికారికీ ఆధారాలతో నిరూపించిన అతని లైసెన్స్ రద్దు చేయడం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సూపరింటెండెంట్  వెంటనే ఆ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్  పట్టించుకోవడంలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశానని తెలిపారు. గత వారం రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ  సూపరింటెండెంట్ కలిస్తే రెసిడెన్సిల్ సర్టిఫికెట్ తీసుకువస్తే స్వామి గౌడ్ లైసెన్సును రద్దు చేస్తానని, చెప్పాడని మళ్లీ మాట మారుస్తున్నాడని అందుకని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని స్వామి గౌడ్ కల్లు దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని కోరారు.

More articles

Latest article