పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వెల్లడి
నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : ఈనెల 21 నుండి 31వ తేదీ వరకు జిల్లాలోని పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సిపి కల్మేశ్వర్ సింగెనవార్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వాహణలో భాగంగా త్యాగం చేయడం జరిగిందని, వారి త్యాగం వలనే నేడు శాంతియుత వాతవరణం లో ఉంటున్నామని అన్నారు. వారి త్యాగలను గుర్తు చేసుకోవడంలో భాగంగా కమీషనరేటులోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజినల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో అమరవీరుల దినోత్సం, క్యాండిల్ ర్యాలీలు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలు, ఉచిత రక్తదాన శిబిరం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
