నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: హైదరాబాద్ లో ఆదివారం నిర్వహించనున్న మాలల సింహగర్జనకు మాలలు, మాల ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావాలని మాల ఉద్యోగుల సంఘం నాయకుడు అలుక కిషన్ కోరారు. శనివారం సుభాష్ నగర్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిర్వహించనున్న సింహ గర్జనకు అందరూ ఐక్యంగా తరలివచ్చి మాలల సత్తాను ప్రభుత్వాలకు చూపించాలన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం కుట్ర కు తెర లేపుతున్నారని ఆయన విమర్శించారు. మాల సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్క ఉద్యోగి సింహగర్జనకు తరలిరావాలని కోరారు.