26.2 C
Hyderabad
Monday, August 3, 2026

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి శాఖాంబరి ఉత్సవాలకు రండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించిన చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే శాఖాంబరి ఉత్సవాల్లో పాల్గొనాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆలయ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణు వర్ధన్ రెడ్డి ఆహ్వానించారు. శనివారం వేద పండితులతో కలిసి బంజారాహిల్స్ లోని ఎమ్మెల్సీ నివాసానికి చేరుకున్న విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్సీ కవితకు వేద ఆశీర్వచనం అందజేశారు.

  • బంజారా పీఠాధిపతుల తిరుపతి వాహన శ్రేణి ప్రారంభం..

తిరుపతి, తిరుమలలో ఆది, సోమవారాల్లో నిర్వహించే హతీరామ్ బావాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తోన్న బంజారా పీఠాధిపతులు, పూజారుల వాహన శ్రేణిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం జెండా ఊపి ప్రారంభించారు. బంజారాల ఆధ్యాత్మిక గురువు, శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హతీరామ్ బావాజీ జయంతి సందర్భంగా భోగ్ బండార్ నిర్వహించేందుకు తెలంగాణ నుంచి పలువురు పీఠాధిపతులు వెళ్లడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ఈ సందర్భంగా బంజారా పీఠాధిపతులు, మహిళలు తమ సంప్రదాయ వస్త్రాలతో ఎమ్మెల్సీ కవితను సత్కరించారు.

More articles

Latest article