29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబలికేంద్రం, చలివేంద్రం ప్రారంభించిన కలెక్టర్ సంగ్వాన్

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ రేట్ ప్రాంగణంలో  టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలికేంద్రం, చలివేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని, పలు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు చలివేంద్రం మరియు అంబలి కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఏటా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీఎన్జీవోస్ సంఘానికి అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎం నాగరాజు, సహాధ్యక్షులు ఎం చక్రధర్, కోశాధికారి ఎం దేవరాజు, ఉపాధ్యక్షులు యు సాయిలు, జె. శ్రావణ్ కుమార్, బి లక్ష్మణ్, రాజమణి, బి రాజేశ్వర్, ఎంసీ పోచయ్య, జాయింట్ సెక్రెటరీలు రమణ, ఖదీర్, రాజమణి రాజారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్,ఈసీ మెంబర్ శ్రీకాంత్, సాయినాథ్, అశ్వాక్, కామారెడ్డి అర్బన్ తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, సృజన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు ఎం కిషన్, ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కె శివకుమార్, జిల్లా కార్యాలయపు ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article