బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బోధన్ సబ్ కలెక్టర్ తో కలిసి బోధన్ మున్సిపాలిటీలోని వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతి, అపరిష్కృత ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, వనమహోత్సవం నాట్లు కార్యక్రమం ,సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో కలెక్టర్ ,బోధన్ సబ్ కలెక్టర్ ,వార్డు అధికారులతో కలిసి వారి బాధ్యతలపై అవగాహన కల్పిస్తూ, ప్రజలకు కలిగే లబ్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, ప్రజలతో నిరంతరంగా సంప్రదింపులు జరపాలని సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ , సబ్ కలెక్టర్ బోధన్ , బోధన్ మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్, మున్సిపల్ మేనేజర్ లతో కలిసి ఒకటవ నంబర్ వార్డు లోని ఇందిరమ్మ ఇళ్ల స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణ పురోగతి, ప్రభుత్వం అందిస్తున్న మద్దతుపై వివరాలు తెలుసుకున్నారు.

