మహిళా సమాఖ్య నాయకులను అభినందించిన కలెక్టర్

0 15,268

కామారెడ్డి, బతుకమ్మ : మహిళా సమాఖ్య నాయకులను బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అభినందించారు. 2024-25 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా ప్రతి మహిళా ను కోటీశ్వరురాలు చేయాలని ఉద్దేశ్యంతో 11668 సంఘాలకు గాను 802 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజి ద్వారా ఋణాలను అందించారు. ఈ సదర్భంగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డీపీఎం (బ్యాంక్ లింకేజి) అదనపు డీఆర్డీఓ, డీఆర్డీఓ డీఆర్ఢీఏ లకు  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.