25.9 C
Hyderabad

బీజేపీ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని హంసన్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గుర్రపు రాజేశ్వర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో ఆయన వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.45 వేల విలువైన చెక్కును శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ సహకారంతో, నిజామాబాద్ రూరల్ ఇన్‌చార్జ్ కులచారి దినేష్ కుమార్ చొరవతో ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. చెక్కును బీజేపీ నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు అందించి, భవిష్యత్తులో కూడా పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తల సంక్షేమానికి బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుం దని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర దిశ కమిటీ సభ్యులు దమ్మారెడ్డి ప్రదీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ భోజన్న, దొంతుల గంగాధర్, పుప్పాల శ్రీనివాస్, రఘు, రాజబాబు, చిన్న భోజన్న, గుర్రపు రాజేశ్వర్, శంకర్, మహమ్మద్ నాసిర్‌తో పాటు గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article