29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బిచ్కుందలో మైనర్ లతో ఇసుక రవాణా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ ప్రజల తీవ్ర అభ్యంతరం

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో అనుమతుల పేరిట మైనర్ల చేత ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. ఉదయం 10 నుండి మొదలుకొని రాత్రి 7 గంటల వరకు విచ్చలవిడిగా మితిమీరిన వేగంతో కొనసాగుతోంది. ఉదయం మొదలుకొని రాత్రి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ని హరిజనవాడ కాలనీలో స్కూల్ పిల్లలు, వృద్ధులు రోడ్లపై నడుస్తుండగా లైసెన్స్ లేని మైనర్లు వేగంగా ట్రాక్టర్లు నడుపుతుండడంతో ప్రమాద భయం నెలకొంది. నంబర్లు లేని ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తూ అధికారులు దాడులు చేసిన అధికారులకు ట్రాక్టర్ యజమానులు ఫోన్ ద్వారా మాట్లాడుతూ సార్ అది మన బండి ఈరోజు డ్రైవర్ రాకపోవడంతో తాత్కాలికంగా పెట్టుకున్నాము వదిలేయండి సార్ మీరు మా మోఖం చూడరా అంటూ మాట్లాడడం గమనార్హం. బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక అయ్యప్ప ఆలయం వద్ద ఇసుక చెక్ పాయింట్ ఉన్నప్పటికీ వచ్చిన వాహనాలకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు ఉన్నాయో లేవో అని చెక్ చేస్తున్నారే తప్ప సదరు డ్రైవర్ కు లైసెన్సు గాని బండి పేపర్లు గానీ ఉన్నాయో లేవో చెక్ చేయకపోవడం విడ్డూరం. వాస్తవానికి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లల చేత ప్రమాదకరమైన పనులను చేయించడం కార్మిక చట్ట ప్రకారం ఉల్లంఘన అయినప్పటికిని వారి తల్లిదండ్రులే ఇంతటి ప్రమాదకరమైన పనులకు పంపించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అధికారుల దృష్టికి మైనర్లు డ్రైవర్లుగా కొనసాగుతున్నారని దృష్టికి వచ్చిన చర్యలు తీసుకోవడంలో మీనా వేషాలు వేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

. . . బిచ్కుంద ఎస్సీ కాలనీవాసుల ఆందోళన

రోజు స్కూల్ పిల్లలు ఈ రోడ్లమీద వెళ్తారు మైనర్లు వేగంగా ట్రాక్టర్లు నడపడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. ఫిర్యాదు చేసిన చర్యలు ఉండట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం మైనర్లచే వాహనాలు నడిపించినట్లయితే ఎలాంటి వారిని ఏమాత్రం సహించబోమని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికిని ధన దాహానికి మరిగిన ఇసుక ట్రాక్టర్ల ఓనర్ల ఓవరాక్షన్ మాత్రం మారడం లేదు. అధికారుల చర్యలతోనైనా మైనర్ల చేత డ్రైవింగ్ మానిపిస్తారా లేక వారి పంతాన్ని నెగ్గించుకుంటారా అంటూ పలువురు బహిరంగంగానే గుసగుసలాడుతున్నారు.

 

Sand transportation with miners in Bichkunda

More articles

Latest article