ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో గురువారం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన జంగా లింగన్నకు రూ.22,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు జంగా లింగన్న మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రనగర్ గ్రామ సర్పంచ్ సందే రంజిత్, గుమ్మిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి రఘుపతి రెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎనెడ్ల రాకేష్ రెడ్డి, బద్దం గంగారెడ్డి, ఎర్రజీ కమ్మరి ముత్తెన్న, కట్లకుంట రాకేష్ రెడ్డి, వైనర్ల శ్రీను, నాగేంద్రనగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్లూరి శాంసన్, జంగా దామోదర్, జంగా కుర్పాల్ తదితరులు పాల్గొన్నారు.
