గుమ్మిర్యాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో గురువారం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన జంగా లింగన్నకు రూ.22,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు జంగా లింగన్న మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుకు సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక...